ముంబై, జూన్ 6: గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. మే 30తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 1.237 బిలియన్ డాలర్లు తరిగిపోయి 691.485 బిలియన్ డాలర్లకు తగ్గాయని రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 1.952 మిలియన్ డాలర్లు తగ్గి 584.215 బిలియన్ డాలర్లకు తగ్గాయని పేర్కొంది.
అలాగే పసిడి రిజర్వులు 723 మిలియన్ డాలర్లు ఎగబాకి 84.305 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని తెలిపింది.