పాట్నా: రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతుండగా, రైలు ఢీకొనడంతో ముగ్గురు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, ముగ్గురు టీనేజర్లు ఫుర్కాన్ ఆలం, సమీర్ ఆలం, హబీబుల్లా అన్సారీ చెవులలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని, రైల్వే ట్రాక్‌పై పబ్జీ గేమ్ ఆడుతున్నారు.
అదే సమయంలో ఓ రైలు వేగంగా వచ్చింది. రైలు శబ్దాన్ని వీరు వినలేకపోయారు. వేగంగా వచ్చిన రైలు వీరిని ఢీకొట్టడంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.