IndiGo | విమానాల్లో సాంకేతిక సమస్యలు (Technical Snag) ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ఇండోర్ నుంచి భువనేశ్వర్ బయల్దేరాల్సిన ఇండిగో (IndiGo) విమానం సాంకేతిక సమస్య కారణంగా గంట ఆలస్యంగా బయల్దేరి వెళ్లింది.
వివరాల్లోకి వెళితే.. 140 మంది ప్రయాణికులతో 6E 6332 విమానం ఇవాళ ఉదయం 9 గంటలకు ఇండోర్ నుంచి భువనేశ్వర్‌కు బయల్దేరాల్సి ఉంది. టేకాఫ్‌కు ఇండోర్ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వేపై సిద్ధంగా ఉంది. ప్రయాణికులు కూడా అందులో ఎక్కారు. ఇంతలో సిబ్బంది విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. సమస్యను పరిష్కరించిన అనంతరం విమానం గంట ఆలస్యంగా 10:16కి బయల్దేరి వెళ్లినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు.
Also Read..
Air India Express | ల్యాండ్ అవ్వకుండానే ఢిల్లీకి తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం
Pahalgam | పహల్గాంకు పర్యాటకులు క్యూ.. ఫొటోలు షేర్ చేసిన జమ్ముకశ్మీర్ సీఎం
Air India Express | లగేజ్ లేకుండా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు ల్యాండ్.. ప్రయాణికులు ఆగ్రహం