పాట్నా: ప్రిన్సిపాల్‌తో కలిసి ఒక టీచర్ అతడి బైక్‌పై స్కూల్‌కు వెళ్తున్నది. ఒక లారీ చెట్టు కొమ్మను లాక్కెళ్లడంతో అది విరిగి వారిపై పడింది. ఈ ప్రమాదంలో ఆ టీచర్ మరణించగా ప్రిన్సిపాల్ గాయపడ్డాడు. (Teacher On Way To School Dies) ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మీనాపూర్లోని తాలింపూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా ఫూల్బాబు రాయ్, టీచర్‌గా విశాఖ పని చేస్తున్నారు. సోమవారం ఉదయం వారిద్దరూ కలిసి బైక్‌పై స్కూల్‌కు బయలుదేరారు.
కాగా, మార్గమధ్యలో వేగంగా వెళ్లిన లారీకి ఒక చెట్టు కొమ్మ చిక్కుకున్నది. దీంతో ఆ పెద్ద కొమ్మ విరిగింది. అప్పుడే అటుగా బైక్‌పై వెళ్తున్న ప్రిన్సిపాల్, టీచర్‌పై అది పడింది. ఆ కొమ్మ రోడ్డుపై పడటంతో వాహనాలు నిలిచిపోయాయి. కొందరు వాహనదారులు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు.
మరోవైపు ఈ ప్రమాదంలో ఉపాధ్యాయురాలు విశాఖ అక్కడికక్కడే మరణించింది. తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపాల్ ఫూల్బాబు రాయ్‌ను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన టీచర్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళ అని పోలీస్ అధికారి తెలిపారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Tragic footage of the accident of a teachers of Middle School Talimpur, Meenapur, #Muzaffarpur, due to a tree branch falling on them while they were going to #school, has come to light. #Bihar #UttarPradesh #accident #viral #viralvideo #CCTV pic.twitter.com/VLnKTeRiFR
— Ekta Chaubey (@EktaChaubey10) January 27, 2025