పాట్నా: ప్రభుత్వ స్కూల్‌కు చెందిన ప్రిన్సిపాల్, టీచర్ మద్యం తాగి వచ్చారు. (Teacher And Principal Drunk) తూలుతూ, మద్యం మత్తులో జోగుతున్న వీరిద్దరిని గ్రామస్తులు గమనించారు. అడ్డుకుని నిలదీయగా వారిని తిట్టారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో ఈ సంఘటన జరిగింది. నలంద జిల్లాలోని ఒక గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా నాగేంద్ర ప్రసాద్, కాంట్రాక్ట్ టీచర్‌గా సుబోధ్ కుమార్ పని చేస్తున్నారు. అయితే మద్యం సేవించిన వారిద్దరూ నడుస్తూ స్కూల్‌కు వచ్చారు. మద్యం మత్తులో జోగుతూ విచిత్రంగా ప్రవర్తించారు.
కాగా, మద్యం తాగి వచ్చిన స్కూల్ ప్రిన్సిపాల్ ప్రసాద్, టీచర్ సుబోధ్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. వారిని నిలదీయగా దుర్భాషలాడారు. ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఆ స్కూల్ వద్దకు చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు వారిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన ఒక పోలీస్ కూడా మద్యం తాగి ఉన్నాడు. ఇది గమనించిన గ్రామస్తులు ఆ పోలీస్‌ను నిలదీశారు. దీంతో అతడ్ని తిరిగి పోలీస్ స్టేషన్‌కు పంపారు. అయితే మద్యం సేవించి స్కూల్‌కు వచ్చిన ప్రిన్సిపాల్, టీచర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A principal and a teacher of a government school in #Bihar‘s #Nalanda district were arrested for showing up drunk to work. The incident took place earlier this week in the state that has been struggling to enforce a liquor ban since 2016.
Nagendra Prasad, the school principal,… pic.twitter.com/ZzVHPMORyK
— Hate Detector 🔍 (@HateDetectors) November 22, 2024