న్యూఢిల్లీ: అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా( Air India ) మళ్లీ 68 ఏళ్ల తర్వాత తన అసలు యజమాని టాటా గ్రూప్ చేతికి వెళ్లిందని మీడియాలో వచ్చిన వార్తలను ప్రభుత్వం ఖండించింది. అత్యధిక బిడ్ దాఖలు చేసిన టాటా గ్రూప్ ఎయిరిండియాను తిరిగి సొంతం చేసుకున్నదని బ్లూమ్బర్గ్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణలో ఆర్థిక బిడ్లను ప్రభుత్వం ఆమోదించిందన్న మీడియా వార్తల్లో నిజం లేదు అని ఆర్థిక శాఖ ఒక ట్వీట్లో వెల్లడించింది. దీనిపై నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వం.. మీడియాకు వెల్లడిస్తుందని స్పష్టం చేసింది.
గత నెలలో ఈ ఎయిరిండియా కోసం టాటా గ్రూప్ తన బిడ్ దాఖలు చేసింది. గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించగా.. నలుగురు మాత్రమే ముందుకు వచ్చారు. అందులో టాటా గ్రూప్ మాత్రమే చివరి దశ వరకూ వచ్చింది. గతంలో 2018, మార్చిలోనూ ఎయిరిండియాను అమ్మడానికి మోదీ సర్కార్ ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది.
Media reports indicating approval of financial bids by Government of India in the AI disinvestment case are incorrect. Media will be informed of the Government decision as and when it is taken. pic.twitter.com/PVMgJdDixS
— Secretary, DIPAM (@SecyDIPAM) October 1, 2021