న్యూఢిల్లీ, జూలై 18 : అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటన బాధితులకు సహాయం అందించడానికి రూ.500 కోట్లతో సంక్షేమ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టు టాటా సన్స్, టాటా ట్రస్టులు శుక్రవారం ప్రకటించాయి. ‘ద ఏఐ-171 మెమోరియల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్’ను ముంబైలో రిజిస్టర్ చేశామని, చెరో రూ.250 కోట్లు ఈ ట్రస్ట్‌కు కేటాయించినట్టు తెలిపాయి.
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, బాధిత కుటుంబాలకు ఇతర దాతృత్వ కార్యక్రమాలు ఈ ట్రస్ట్ నుంచే అందజేస్తామని వివరించాయి. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందజేయడంతో పాటు దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పునర్నిర్మాణానికి, మరమ్మతులకు నిధులు వెచ్చిస్తామని తెలిపాయి.