Armstrong Murder : తమిళనాడు బీఎస్పీ చీఫ్ కే ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యోదంతంపై బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ద్రావిడ మోడల్ ఇప్పుడు హత్యా రాజకీయాల మోడల్‌గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. తమిళనాడులో హత్యా రాజకీయాలు పెరుగుతున్నాయని, ఇంత జరుగుతున్నా సీఎం స్టాలిన్ మౌన ముద్ర దాల్చారని ఆరోపించారు.
ఈ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. కల్తీ సారా ఘటనతో ప్రజలు మృత్యువాత పడిన కళ్లకురుచిని స్టాలిన్ ఎందుకు సందర్శించలేదని తమిళిసై ప్రశ్నించారు. ఆర్మ్‌స్ట్రాంగ్ వంటి నేత మరణిస్తే ఆయనకు నివాళులు అర్పించేందుకు కూడా స్టాలిన్ రాలేదంటే ఇక్కడకు వచ్చేందుకు ఆయన భయపడ్డారని అర్ధమవుతోందని ఆమె ఆరోపించారు.
కాగా, బీఎస్పీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ శుక్రవారం రాత్రి పెరంబూరులోని తన ఇంటికి సమీపంలో హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు బైకులపై వచ్చి ఆయనను హత్య చేశారు. మరోవైపు తమిళనాడు బీఎస్పీ చీఫ్ కె ఆర్మ్‌స్ట్రాంగ్ (K Armstrong) కు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి (Mayawati ) నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్ ఆనంద్ (Akash Anand) తో కలిసి తమిళనాడు రాజధాని చెన్నైకి చేరుకున్న మాయావతి.. అక్కడి నేరుగా ఆర్మ్‌స్ట్రాంగ్ నివాసానికి చేరుకున్నారు.
Read More :