Titanic and Avatar producer | హాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ ప్రోడ్యూసర్, ‘టైటానిక్’, ‘అవతార్ చిత్రాల నిర్మాత జాన్ లాండౌ మృతిచెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక ఆయన మృతిపట్ల దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్, సామ్ వర్తింగ్స్టన్ తదితరులు సంతాపం ప్రకటించారు.
1980లో ప్రొడక్షన్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించిన జాన్ టైటానిక్ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాను 1997లో నిర్మించిన ఆయన అప్పట్లోనే ఈ చిత్రం కోసం 200 మిలియన్ల బడ్జెట్‌ను పెట్టగా.. సూమారు రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి కలెక్షన్స్ మాత్రమే కాకుండా 11 ఆస్కార్ అవార్డులు దక్కించుకుంది. ఇప్పటివరకు అత్యధిక ఆస్కార్ అవార్డులు అందుకున్న చిత్రాలలో టైటానిక్ రెండో స్థానంలో నిలిచింది.
ఇవి కుడా చదవండి..