House collapsed : గుజరాత్లోని సూరత్ నగరంలో శనివారం మధ్యాహ్నం ఆరంతస్తుల భవనం కూలి ఏడుగురు మరణించిన ఘటనను మరువకముందే, అక్కడ సహాయక చర్యలు ఇంకా ముగియకముందే.. జార్ఖండ్లో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. డియోగఢ్లో ఆదివారం తెల్లవారుజామున మూడంతస్తుల భవనం కుప్పకూలింది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి ఇద్దరు క్షతగాత్రులను బయటికి తీసి చికిత్స నిమిత్తం సదార్ ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉంటారని స్థానికులు చెబుతున్నారు.
#WATCH | A house collapsed in Jharkhand’s Deoghar. Rescue operation underway by NDRF and district officials pic.twitter.com/Lg28aKmVKl
— ANI (@ANI) July 7, 2024
దాంతో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నది. కూలిపోయిన భవనంలో గత కొన్ని రోజులుగా మరమ్మతులు జరుగుతున్నాయని, ఆ కారణంగానే అప్పటికే పాతబడి ఉన్న భవనం కూలిపోయిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. ముందుగా బాధితులను రక్షించడమే తమ కర్తవ్యమని అన్నారు.