CM Hemant Soren | రేపు జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష.. సులభంగా గట్టెక్కనున్న సీఎం సోరెన్
జేఎంఎం నేత హేమంత్ సోరెన్ (CM Hemant Soren) జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పాలనా పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జూలై 8న అసెంబ్లీలో విశ్వాస పరీక్ష (Trust Vote) నిర్వహించనున్నారు. ఈమేరకు మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నది
రాంచీ: జేఎంఎం నేత హేమంత్ సోరెన్ (CM Hemant Soren) జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పాలనా పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జూలై 8న అసెంబ్లీలో విశ్వాస పరీక్ష (Trust Vote) నిర్వహించనున్నారు. ఈమేరకు మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నది. దీంతో సోమవారం శాసన సభలో సీఎం సోరెన్ విశ్వాస పరీక్ష కోరనున్నారు. అయితే సభలో అధికార కూటమికి పూర్తి మెజారిటీ ఉండటంతో ప్రభుత్వం సులభంగా గట్టెక్కనుంది.
జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 81. ఇందులో అధికార కూటమిలోని జేఎంఎంకు 27, కాంగ్రెస్‌కు 17, ఆర్జేడీకి 1 ఎమ్మెల్యే చొప్పున ఉన్నాయి. ఇక విపక్ష బీజేపీకి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వాస తీర్మాణం నెగ్గాలంటే 42 మంది సభ్యుల మద్దతు పలకాల్సి ఉంటుంది. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత మ్యాజిక్ మార్కు 38కి తగ్గింది. కాగా, జేఎంఎంకు పూర్తి మెజార్టీ ఉండటంతో ఈజీగానే సోరెన్ విశ్వాస పరీక్షలో నెగ్గనున్నారు. దీనితర్వాత ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు.
మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన హేమంత్ సొరేన్ జూన్ 28న బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 3 జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలు సమావేశమై హేమంత్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత శుక్రవారం జార్ఖండ్ 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

