చెన్నై, సెప్టెంబర్ 6: తమిళనాడులో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకంలో దళిత మహిళ వండుతున్నదన్న కారణంగా విద్యార్థులు అల్పాహారాన్ని తీసుకోవడం లేదు. కరూర్ జిల్లా విలాన్ చెట్టియార్ పంచాయతీ యూనియన్ స్కూ ల్లో వంట మనిషి సుమతి చేసిన బ్రేక్‌ఫాస్ట్‌ను 15 మం ది విద్యార్థులు తిరస్కరిస్తున్నారు.
దీంతో కలెక్టర్ ప్రభు శంకర్ పాఠశాలను సందర్శించారు. సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ను తిరస్కరిస్తున్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.