ECI : లోక్సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 19 తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అక్కడ 69.2 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. అయితే దేశవ్యాప్తంగా చూస్తే లోక్సభ తొలి దశ ఎన్నికల్లో 60 శాతం పోలింగ్ మాత్రమే నమోదు కావడం గమనార్హం.
మొత్తం ఏడు దశల సుదీర్ఘ లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 19న తొలి విడత ఎన్నికల పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. రెండో విడత ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా మే 13న పోలింగ్ నిర్వహిస్తారు.
ఏడు దశల లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 26న, మూడో దశ ఎన్నికల పోలింగ్ మే 7న, నాలుగో దశ పోలింగ్ మే 13న, ఐదో దశ పోలింగ్ మే 20న, ఆరో దశ పోలింగ్ మే 25న, ఏడో దశ పోలింగ్ జూన్ 1న నిర్వహించనున్నారు. జూన్ 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
Tamil Nadu registered 69.72% voter turnout in Lok Sabha elections on 19th April, says Election Commission of India. pic.twitter.com/IVuo9JQjfz
— ANI (@ANI) April 21, 2024