చెన్నై: హిందీ భాష దేశ ప్రజలను కలిపి ఉంచుతుందని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. అయన వ్యాఖ్యలు అర్థరహితమైనవని, దేశంలో హిందీ నాలుగైదు రాష్ర్టాల్లో మాత్రమే మాట్లాడుతారని, అలాంటప్పుడు అది భారతజాతి మొత్తాన్ని ఐక్యంగా ఉంచుతుందనడంలో అర్థం లేదని విమర్శించారు.
తమిళనాడులో తమిళం, పొరుగున ఉన్న కేరళలో మలయాళం మాట్లాడుతారని ఈ రెండు రాష్ర్టాలను హిందీ ఏవిధంగా కలుపుతుందని ఆయన ఎక్స్‌లో ప్రశ్నించారు. ప్రాంతీయ భాషలను అవమానించడం షాకు తగదని హితవుపలికారు.