చెన్నై: తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి బుధవారం ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించనున్నారు. గతవారం సెంథిల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్టు నమోదైన కేసులో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సెంథిల్‌కు ఛాతినొప్పి రావడంతో దవాఖానలో చేరగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు.