చెన్నై: కూలీలైన ఇద్దరు వ్యక్తులు మరణించారు. అయితే వారి మృతదేహాలు తారుమారయ్యాయి. స్థానిక వ్యక్తి మృతదేహాన్ని బీహార్‌కు తరలించారు. (Dead body mistaken) పొరపాటును గుర్తించి వెనక్కి రప్పించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై దర్యాప్తునకు ఆదేశించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తిరుత్తణి సమీపంలోని గ్రామానికి చెందిన 60 ఏళ్లకుపైబడిన రాజేంద్రన్ వ్యవసాయ కూలీ. ఆత్మహత్యకు పాల్పడటంతో అతడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తిరువళ్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, బీహార్‌కు చెందిన 55 ఏళ్ల మనోజ్ మాంచి గత నెలలో పని కోసం తమిళనాడు వచ్చాడు. కూలీ పని చేస్తున్న అతడు అనారోగ్యంతో తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించాడు. అయితే మార్చురీ సిబ్బంది పొరపాటుపడ్డారు. మనోజ్ మృతదేహానికి బదులు రాజేంద్రన్ మృతదేహాన్ని అంబులెన్స్‌లో బీహార్‌కు పంపారు.
మరోవైపు రాజేంద్రన్ మృతదేహం కనిపించకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. పొరపాటున బీహార్‌కు పంపినట్లు తెలుసుకుని నిరసన చేపట్టారు. దీంతో తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సుమారు 800 కిలోమీటర్లు ప్రయాణించిన అంబులెన్స్‌ను వెనక్కి రప్పించారు.
కాగా, గురువారం తిరువళ్లూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు చేరుకున్న రాజేంద్రన్ మృతదేహాన్ని అతడి కుటుంబానికి అప్పగించారు. చివరకు మనోజ్ మృతదేహాన్ని అతడి కుటుంబం గుర్తించిన తర్వాత బీహార్‌కు పంపారు. మరోసారి ఇలాంటి పొరపాటు జరుగకుండా ఈ నిర్లక్ష్యంపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అధికారి తెలిపారు.
Also Read: