చెన్నై, అక్టోబర్ 4: నూతన వైద్య కళాశాలల ప్రారంభాన్ని కట్టడి చేస్తూ ఇటీవల నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) జారీచేసిన నోటిఫికేషన్ను వెంటనే సస్పెండ్ చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ఓ లేఖ రాశారు.
ఎన్ఎంసీ నోటిఫికేషన్ ‘తిరోగమన పరిస్థితి’ని సృష్టించిందని, 2023-24 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక జారీ అయిన ఈ నోటిఫికేషన్ చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్ఎంసీ నోటిఫికేషన్ను వెంటనే సస్పెండ్ చేసేలా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను ఆదేశించాలని ప్రధానిని కోరారు.