CM Stalin | మణిపూర్ తరహాలో అల్లర్లకు బీజేపీ కుట్ర..తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపణ
యూపీ, మణిపూర్ తరహాలో తమిళనాడులో హింసను ప్రేరేపించడానికి బీజేపీ కుట్ర చేసిందని, అయితే దానిని తాము సమర్థంగా తిప్పికొట్టినట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు.
- తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపణ
తిరుచిరాపల్లి, ఏప్రిల్ 1: యూపీ, మణిపూర్ తరహాలో తమిళనాడులో హింసను ప్రేరేపించడానికి బీజేపీ కుట్ర చేసిందని, అయితే దానిని తాము సమర్థంగా తిప్పికొట్టినట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. బుధవారం ఇక్కడ జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ర్టాలైన యూపీలోని మూక హింస, మణిపూర్‌లోని అల్లర్ల మాదిరిగా తమిళనాడులో ఎలాంటి కుల కొట్లాటలు, మత హింస జరగ లేదని చెప్పారు. తమిళనాడులో సైతం అలాంటి పరిస్థితిని సృష్టించడానికి బీజేపీ ప్రయత్నించిందని, అయితే తమ పార్టీ దానిని సమర్థంగా ఎదుర్కొన్నట్టు ఆయన తెలిపారు. డీఎంకే తిరిగి అధికారంలోకి వస్తే మహిళలకు రూ. 8,000 కూపన్‌ను అందజేస్తుందని, దానితో మహిళలు తమకు నచ్చిన గృహోపకరణాలను ఉచితంగా కొనుగోలు చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. మహిళలకు ప్రస్తుతం నెలకు అందిస్తున్న నగదు సహాయాన్ని 2,000కు, కళాశాల విద్యార్ధులకు 1,500కు పెంచుతామని స్టాలిన్ హామీనిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

