CM MK Stalin: గవర్నర్లకు డెడ్లైన్ ఉండాల్సిందే.. రాజ్యాంగ సవరణ చేపట్టే వరకు విశ్రమించం : సీఎం స్టాలిన్
CM MK Stalin: బిల్లులకు ఆమోదం దక్కాలంటే.. గవర్నర్లకు గడువు ఉండాల్సిందే అని తమిళనాడు సీఎం అన్నారు. దీని కోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. గవర్నర్లకు గడువు విధించే వరకు విశ్రమించలేది లేదని పేర్కొన్నారు.
చెన్నై: బిల్లులను క్లియర్ చేసేందుకు రాష్ట్రపతికి, గవర్నర్లకు గడువు విధించలేమని సుప్రీంకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్(CM MK Stalin) స్పందించారు. బిల్లులకు ఆమోదం దక్కాలంటే.. గవర్నర్లకు గడువు ఉండాల్సిందే అని ఆయన అన్నారు. దీని కోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్లకు గడువు విధించే వరకు విశ్రమించలేది లేదని స్టాలిన్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ముర్ము అడిగిన ప్రశ్నలకు సుప్రీంకోర్టు చేసిన సూచనలపై సీఎం స్టాలిన్ రియాక్ట్ అవుతూ.. రాష్ట్ర హక్కుల కోసం పోరాడనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర హక్కులు, నిజమైన ఫెడరల్ స్పూర్తి కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. తమిళనాడు రాష్ట్రం, గవర్నర్ మధ్య జరిగిన కేసులో ఏప్రిల్ 8వ తేదీన ఇచ్చిన తీర్పుపై ప్రభావం ఉండదన్నారు.
☀️ Our fight for State rights and true federalism will continue!
☀️ No rest until amending the Constitution to fix timelines for Governors to clear Bills!
The Supreme Court’s opinion in its answer to the Presidential Reference will have no impact on the April 8, 2025 judgment… pic.twitter.com/YHnD6pxs7c
— M.K.Stalin – தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) November 21, 2025
పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవని గురువారం సుప్రీంకోర్టు తెలిపింది. నిర్ణీత కాల వ్యవధిలో గవర్నర్లు బిల్లులపై నిర్ణయం తీసుకోకపోతే, ఆటోమెటిక్గా వాటికి ఆమోదం లభిస్తుందనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కోర్టు గుర్తు చేసింది. అలాంటి సంప్రదాయాన్ని తాము తీసుకురాబోమని వెల్లడించింది. కానీ, కారణం లేకుండా దీర్ఘకాలంగా బిల్లులను పెండింగ్లో ఉంచితే, కోర్టులు పరిమితంగా జోక్యం చేసుకోవచ్చని వివరించింది. ఈ మేరకు దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము సంధించిన 14 ప్రశ్నలకు (ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్) సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ ఏఎస్ చందూర్కర్తో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమగ్రంగా సమాధానమిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

