Firecrackers | దీపావళి (Diwali).. వెలుగుల పండుగ. ఈ పండుగ వచ్చిందంటే చాలు చిన్నారులతోపాటూ పెద్దల్లోనూ ఉత్సాహం రెట్టింపు అవుతుంది. రెండు రోజుల ముందు నుంచే ఇంటిని అలంకరించడం, దీపాలను వెలిగించడంలో పెద్దలు బిజీగా ఉంటే.. చిన్నారులు మాత్రం పటాకులు (Firecrackers) కాల్చడంలో బిజీగా ఉంటారు.
ఈ పండుగ జీవితాల్లో వెలుగులు నింపాలి.. కానీ నిర్లక్ష్యం, చిన్నపాటి తప్పిదాలతో ఎన్నో కుటుంబాల్లో విషాదం నెలకొంటూ ఉంటుంది. పటాకులు కాల్చేటప్పుడో, దీపాలు వెలిగించేటప్పుడో అనుకోకుండా ప్రమాదాలబారిన పడుతుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి కంటి చూపును కూడా కోల్పోయిన ఘటనలు మనం అనేకం చూశాం. చిన్నపాటి జాగ్రత్తలు, అప్రమత్తతో దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలంటూ.. ప్రజలకు సూచిస్తున్నారు కంటి వైద్యనిపుణులు. ఈ దీపావళి సమయంలో ప్రజలు, చిన్నారులు జాగ్రత్తలు పాటించి, ఆనందంగా పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read..
Karwa Chauth | కోడలి కోసం అత్తగారి ప్రత్యేక వంటకం.. కర్వాచౌత్ విశేషాలు..