న్యూఢిల్లీ : ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో కొన్ని నగరాల్లో ప్లాట్ఫాం ఫీజును రూ.10కి పెంచేశాయి. దీనికి సంబంధించిన ఓ నివేదికపై స్పందిస్తూ జొమాటో గురువారం వివరణ ఇచ్చింది. తాము బుధవారం నుంచి ప్లాట్ఫాం ఫీజును పెంచామని చెప్పింది. ఇదంతా నిత్యం జరిగే వ్యాపారానికి సంబంధించిన అంశమని తెలిపింది. ఇటువంటి మార్పులు ఒక్కో నగరంలో ఒక్కొక్క విధంగా ఉంటాయని వివరించింది. ఈ కంపెనీ న్యూఢిల్లీలో వసూలు చేసే ఫెస్టివ్ సీజన్ ప్లాట్ఫాం ఫీజు రూ.10కి చేరింది.