Kolkata Incident : ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు ప్రధాన కారణం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీయేనని బెంగాల్ అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. మమతా బెనర్జీ తక్షణమే సీఎం పదవి నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. ఆధారాలు ధ్వంసం చేస్తే దోషిని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కోల్కతా ఘటనకు నిరసనగా 5000 మందికి పైగా మహిళలు వీధుల్లోకి వచ్చారని, ఈ ప్రదర్శనకు తాము మద్దతు ప్రకటించామని సువేందు అధికారి తెలిపారు.
ఆర్జీ కర్ సోదరి విషాదాంతానికి దీదీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాగా పశ్చిమ బెంగాల్ సాంస్కృతిక, సారస్వత ఫోరం ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో మహిళలు ఆర్జీ కర్ ఘటనకు వ్యతిరేకంగా కోల్కతాలో మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు.కాగా, కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనకు వ్యతిరేకంగా కోల్కతాలో విపక్షాలు, మహిళా, ప్రజా సంఘాల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. మరోవైపు మహిళలపై నేరాలకు చెక్ పెడుతూ కఠిన చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ తాను ప్రధాని నరేంద్ర మోదీకి రెండు లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేదని మమతా బెనర్జీ బెంగాల్ అసెంబ్లీలో పేర్కొన్నారు. తన లేఖలపై మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచీ, కేంద్ర ప్రభుత్వం నుంచీ సమాధానం రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :
Heavy rains | తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు నిలిచిన రాకపోకలు