Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ 9వ సీఎంగా సువేందు అధికారి
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే 9వ వ్యక్తిగా సువేందు అధికారి నిలిచారు. సువేందు వయసు 55 ఏళ్లు. బెంగాల్ గ్రామీణ జిల్లాల్లో ఆయనకు మంచి పట్టు ఉన్నది.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే 9వ వ్యక్తిగా సువేందు అధికారి(Suvendu Adhikari) నిలిచారు. సువేందు వయసు 55 ఏళ్లు. బెంగాల్ గ్రామీణ జిల్లాల్లో ఆయనకు మంచి పట్టు ఉన్నది. బెంగాల్ గ్రామీణ ప్రాంతం నుంచి 1971లో చివరిసారి అజోయ్ ముఖర్జీ సీఎం అయ్యారు. కాంగ్రెస్ సీఎంగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 1969లో ఇందిరా గాంధీ నాయకత్వంలో పార్టీ విభజన జరిగినప్పుడు అజోయ్ సీఎం అయ్యారు. సువేందు అధికారి తండ్రి గతంలో కేంద్ర మంత్రిగా చేశారు. ఆయన పేరు సిసిర్ అధికారి. కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్‌లో సువేందు తన కెరీర్‌ను మొదలుపెట్టారు. బెంగాల్లో వామపక్షాల ఆధిపత్యం ఉన్న సమయంలో.. ఛాత్ర పరిషత్‌లో సువేందు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీలో చేరడానికి ముందు దీదీకి చాలా నమ్మకస్తుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన మమతా బెనర్జీకి ప్రధాన ప్రత్యర్థిగా తయారయ్యారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రెండు సార్లు దీదీపై పోటీ చేసి సువేందు నెగ్గారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

