ముర్సీదాబాద్: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమయున్ కబీర్.. ఇవాళ బాబ్రీ మసీదు(Babri Masjid) నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్సీదాబాద్‌లో ఆ మసీదు నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. అయోధ్యలో గతంలో ఉన్న బాబ్రీ మసీదు తరహాలో ముర్సీదాబాద్లోనూ మసీదును నిర్మించనున్నారు. భారీ భద్రత మధ్య రెజినగర్‌లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేల సంఖ్యలో జనం ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా మంది మసీదు నిర్మాణం కోసం స్వచ్చంగా ఇటుకలు మోసారు. మసీదు నిర్మాణం కోసం చేపట్టిన భూమిపూజ సందర్భంగా ఎమ్మెల్యే కబీర్ తన అనుచరులతో కలిసి రిబ్బన్ కట్ చేశారు. నారా -ఈ-తక్బీర్, అల్లాహూ అక్బర్ అని అరిచారు. మతఘర్షణలకు దారి తీసే రీతిలో ప్రవర్తిస్తున్న ఎమ్మెల్యే కబీర్‌ను ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ ఛేసింది.
They’re “Bengali”… They speak the same language… Says ‘Unity in diversity, religion is personal, festivals for all’.
Yet the same people are now seen carrying bricks at the instruction of suspended TMC MLA Humayun Kabir, who who build Babri Masjid in Murshidabad. pic.twitter.com/RETmEGmNdt
— Tushar Kanti Ghosh (@TusharKantiBJP) December 6, 2025