Prajwal Revanna | కర్ణాటక సెక్స్ స్కాండ్ కేసులో (Karnataka Sex Scandal Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) నాయకుడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) ముందస్తు బెయిల్ (anticipatory bail) కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం బెంగళూరు సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రజ్వల్ పేరుతో ఈ పిటిషన్ దాఖలైనట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా, లైంగిక ఆరోపణల అనంతరం విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ రేపు భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ప్రజ్వల్ భారత్‌లో ల్యాండ్ కాగానే అతన్ని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతడు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక దౌర్జన్యం ఆరోపణలు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆరోపణల అనంతరం ఏప్రిల్ 26 తర్వాత ఆయన దేశం విడిచి దౌత్య పాస్‌పోర్ట్‌తో జర్మనీ పారిపోయారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.. ప్రజ్వల్‌పై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. ఇక ఇన్ని రోజులూ విదేశాల్లోనే ఉన్న ప్రజ్వల్ మొన్న ఓ వీడియో రిలీజ్ చేశారు. మే 31 ఉదయం 10 గంటలకు సిట్ ముందు విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు.
మరోవైపు ప్రజ్వల్ 30న జర్మనీలోని మ్యూనిచ్ నుంచి భారత్‌కు బయల్దేరనున్నట్లు పీటీఐ వర్గాలు బుధవారం వెల్లడించాయి. మే 31న ఉదయం 10 గంటలకు అతడు సిట్ ముందు హాజరు కావాల్సి ఉంది. మరోవైపు ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో ప్రజ్వల్ కోసం నిఘా పెట్టింది. విమానాశ్రయంలో ప్రజ్వల్ ల్యాండ్ కాగానే అతడిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Also Read..
Delhi Fire Services | వేసవిలో వరుస అగ్నిప్రమాదాలు.. ఢిల్లీ అగ్నిమాపక శాఖకు రోజుకు 200 కాల్స్
Bibhav Kumar | స్వాతి మలివాల్ కేసు.. తన అరెస్ట్‌ను హైకోర్టులో సవాల్ చేసిన బిభవ్ కుమార్
Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు భారీ షాక్.. బెయిల్ పొడిగింపు పిటిషన్ విచారణకు సుప్రీం నిరాకరణ