Crime news : కనిపెంచిన బిడ్డపట్ల ఓ తండ్రి కర్కషంగా వ్యవహరించాడు. ఆమె ఎవరితోనో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో దారుణానికి పాల్పడ్డాడు. ఆమె రెండు చేతులు వెనక్కి విరిచి కట్టి తీసుకెళ్లి, ఓ కాలువలో తోసేశాడు. ఆమె కన్నతల్లి ‘నా బిడ్డా.. నా బిడ్డా..’ అని కేకలు వేస్తూ గుండెలు బాదుకున్నా అతడు పట్టించకోలేదు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్పూర్ జిల్లాకు సుర్జీత్ సింగ్ భార్య, కుమార్తె కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో కుమార్తె ప్రవర్తనను సుర్జీత్ అనుమానించాడు. ఆమె ఎవరితోనో సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. కుమార్తె తీరును అవమానంగా భావించిన అతడు.. ఆమె రెండు చేతులు వెనక్కి విరిచి కట్టి కాలువలో తోసేశాడు.
భార్య వారించినా పట్టించుకోలేదు. బాలిక కాలువలో కొట్టుకుపోయిన తర్వాత ‘నా బిడ్డ ఏమైంది.. నా బిడ్డ ఏమై పోయింది..?’ అని గుండెలు బాదుకుంటూ ఆమె రోదించింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడి భార్య నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. కాలువలో గల్లంతైన బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.