అయోధ్య : అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో నిర్మించిన దివ్యమైన రామాలయం శ్రీరామ నవమి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముని నుదుటిపై సూర్య కిరణాలతో తిలకం దిద్దనున్నారు. ఈ అద్భుత ఘట్టం దాదాపు నాలుగు నిమిషాలపాటు కొనసాగుతుంది. దీనిని భక్తులు తిలకించేందుకు ఏర్పాట్లు చేసినట్లు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ తెలిపింది. శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా బాల రామునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించనున్నారు.