రాహుల్ అప్పీల్ తిరస్కరణ
రువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ రాహుల్‌గాంధీ చేసిన అప్పీల్‌ను తిరస్కరిస్తూ గురువారం తీర్పు వెలువరించింది.
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీకి సూరత్ సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలంటూ రాహుల్‌గాంధీ చేసిన అప్పీల్‌ను తిరస్కరిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. ప్రధాని మోదీ ఇంటిపేరును ప్రస్తావిస్తూ 2019లో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ పరువునష్టం కేసు దాఖలుకాగా, ఈ కేసులో సూరత్ కోర్టు రాహుల్‌గాంధీని దోషిగా తేల్చుతూ రెండేండ్ల జైలు శిక్ష విధించింది.
ఈ తీర్పును సవాల్ చేసుకోవడానికి కోర్టు 30 రోజుల గడువుతో బెయిల్ మంజూరు చేసింది. తీర్పును సవాల్ చేస్తూ ఏప్రిల్ 3న సూరత్ సెషన్స్ కోర్టును రాహుల్ ఆశ్రయించారు. జైలు శిక్ష తీర్పును నిలిపివేయాలని, పైకోర్టులో తీర్పు వెలువడేవరకూ తనను దోషిగా తేల్చటాన్ని ఆపాలని కోరుతూ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. న్యాయస్థానం తనపై కఠినమైన శిక్షను విధించిందని పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను రద్దు చేయకపోతే, తన పరువుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాదనలు వినిపించారు. అయితే సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆర్పీ మోజేరా.. రాహుల్ వాదనలను తోసిపుచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- court
- Petition
- Rahul Gandhi
- reject
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

