Supriya Sule | స్మార్ట్ సిటీ స్కీమ్‌తో ఏం సాధించారు..: మోదీ సర్కార్‌పై ఎన్సీపీ ఎంపీ ఫైర్
Supriya Sule : నరేంద్ర మోదీ సర్కార్ ఆర్భాటంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీ పధకం ఘోరంగా విఫలమైందని ఎన్సీపీ-ఎస్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు.
Supriya Sule : నరేంద్ర మోదీ సర్కార్ ఆర్భాటంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీ పధకం ఘోరంగా విఫలమైందని ఎన్సీపీ-ఎస్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. దేశంలో ఏ నగరం స్మార్ట్‌గా మారిందని ఆమె ప్రశ్నించారు. ఈ పధకంపై కోట్లాది రూపాయలు వెచ్చించినా ఆశించిన ఫలితాలు చేకూరలేదని చెప్పారు. ప్రతి ఇంటికీ నీరు కోసం నిధులు కేటాయించినా అసలు భూగర్భ జలాలే ఇంకిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో భారీ వర్షాలు, పుణే వరదలపై సుప్రియా సూలే మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్ధత కారణంగా పన్నుచెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం నిర్వాసితులకు ఆశ్రయం కల్పించడంతో పాటు ఆహారం, మంచినీరు సరఫరా చేయాలని, వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పరిస్ధితి మెరుగుపరచాలని కోరారు.
వరదతో సర్వం కోల్పోయిన వారికి పునరావస ప్యాకేజ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్వాకంతో పుణే వాసులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.మరోవైపు ముంబై, పుణే నగరాల్లో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించడంతో అప్రమత్తమైన అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, ఈ రెండురోజులు ఇండ్లకే పరిమితం కావాలని అధికారులు సూచించారు.
Read More :
Skanda | యూట్యూబ్‌లో రామ్-బోయపాటి సునామి.. స్కందకు రికార్డు రెస్పాన్స్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

