న్యూఢిల్లీ, నవంబర్ 13 : ప్రమాదానికి కారకుడైన వాహన యజమాని బీమా ఒప్పందాన్ని ఉల్లంఘించినప్పటికీ ప్రమాద బాధితులకు లేదా వారి కుటుంబ సభ్యులకు బీమా కంపెనీలే నష్ట పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. విడిగా పిటిషన్ దాఖలు చేసి నష్ట పరిహారం సొమ్మును వాహన యజమాని నుంచి బీమా కంపెనీలు వసూలు చేసుకోవాలని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.
బీమా నిబంధనల ఉల్లంఘన జరిగినప్పటికీ ప్రమాద బాధితునికి నష్టపరిహారం చెల్లించి ఆ తర్వాత ఆ సొమ్మును వాహన యజమాని నుంచి వసూలు చేసుకునే అధికారాన్ని బీమా కంపెనీలకు ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆకుల నారాయణ దాఖలు చేసిన అప్పీలును అనుమతిస్తూ జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.