న్యూఢిల్లీ, అక్టోబర్ 28: నీట్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వచ్చే నెల 16న విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తెలిపింది. ఓబీసీలకు 27%, ఈడబ్ల్యూఎస్‌కు 10% రిజర్వేషన్లు కేటాయిస్తూ జూలై 29న మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ నోటిఫికేషన్ చెల్లుబాటును తేల్చేవరకు వైద్య కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించబోమని సుప్రీం కోర్టుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.