Rahul Gandhi | న్యూఢిల్లీ, జూలై 18: పరువు నష్టం కేసులో పడిన శిక్షపై స్టే విధించడానికి నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నెల 21న ఈ పిటిషన్ను విచారిస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం మంగళవారం వెల్లడించింది.
మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించడంతో రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయారు.