న్యూఢిల్లీ, ఆగస్టు 21: తమిళనాడు, కర్ణాటక మధ్య దశాబ్ధాలుగా కొనసాగుతున్న కావేరీ నదీ జలాల పంపకం వివాదంపై విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం పేర్కొన్నది. కావేరీ జలాల వివాదంపై అత్యవసర విచారణ చేపట్టాలని తమిళనాడు తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి ధర్మాసనాన్ని కోరారు.
కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ(సీడబ్ల్యూఎంఏ) ఆదేశాల మేరకు ఆగస్టు నెలకు సంబంధించి నీటిని విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం అప్లికేషన్ సమర్పించిందని పేర్కొన్నారు.