న్యూఢిల్లీ: మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు పోక్సో చట్టం కింద కేసును ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి ఎటువంటి శిక్ష విధించకుండా సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 142 అధికరణ కింద తనకు గల అసాధారణ అధికారాలను ఉపయోగించింది.
అయితే ఇదే సుప్రీంకోర్టు నిరుడు నిందితుడిని నిర్దోషిగా విడుదల చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును తిరస్కరించడమేగాక తీర్పు అమలును నిలిపివేయడం విశేషం. ధర్మాసనం శుక్రవారం ఈ కేసుపై తీర్పు వెలువరిస్తూ తనపై జరిగింది నేరమని బాధితురాలికి కూడా తెలియదని, ఈ ఘటన వల్ల చట్టపరంగా బాధితురాలు చాలా కష్టాలు అనుభవించిందని ధర్మాసనం పేర్కొంది. బాధితురాలు ప్రస్తుతం తన భర్త, బిడ్డతో కలసి పశ్చిమ బెంగాల్లో జీవిస్తోంది.