న్యూఢిల్లీ : యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించే ఖైదీల శిక్షా కాలాన్ని తగ్గించడం కోసం కఠినమైన షరతులను విధించరాదని సుప్రీంకోర్టు చెప్పింది. అమలు చేయడం కష్టంగా మారే షరతులను విధించరాదని తెలిపింది. అటువంటి షరతుల వల్ల శిక్ష తగ్గింపు ప్రయోజనాలు వ్యర్థమవుతాయని వివరించింది. విధించే షరతుల ఉల్లంఘనను సులువుగా తెలుసుకోగలిగేలా ఉండాలని చెప్పింది.
శిక్షా కాలం తగ్గింపును రద్దు చేసినట్లయితే, ఎందుకు రద్దు చేశారో తెలుసుకునేందుకు విచారణను కోరే హక్కు దోషులకు ఉండాలని తెలిపింది. జీవిత ఖైదీకి విధించదగిన షరతులు, ఆ తగ్గింపును ఎటువంటి పరిస్థితుల్లో రద్దు చేయవచ్చు? అనే అంశాలపై సుప్రీం తీర్పును రిజర్వు చేసింది.