న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల్లో బెయిలు దశలోనే సాక్ష్యాధారాలను పరిశీలించి, నిందితుడి దోషిత్వం లేదా నిర్దోషిత్వం గురించి నిర్ణయించరాదని హైకోర్టులకు సుప్రీంకోర్టు చెప్పింది. గత ఏడాది జరిగిన హత్య కేసులో నిందితుడు అమిత్ కుమార్ బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు వాస్తవాలను పరిశీలించినట్లు చెప్తూ, మే 27న బెయిలు మంజూరు చేసింది. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు సోమవారం రద్దు చేసింది. మళ్లీ విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది.