న్యూఢిల్లీ: ఈవీఎంల పనితీరును(EVMs Functioning) ప్రశ్నిస్తూ దాఖలైన పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. ప్రతి అంశానికి ప్లస్, మైనస్ ఉంటుందని సుప్రీం ఈ కేసులో అభిప్రాయపడింది. ఈవీఎంలతో అక్రమాలు జరుగుతున్నట్లు పిటీషన్లో ఆరోపించారు. అయితే జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్త, ఆగస్టిన్ జార్జ్ మాషిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఇప్పటికే అనేకమార్లు ఈ అంశానికి చెందిన పిటీషన్లను పరిశీలించామని, ఈవీఎంల పనితీరుకు చెందిన సమస్యల గురించి కూడా కోర్టు ప్రస్తావించినట్లు బెంచ్ తెలిపింది.
ఈవీఎంలపై ఇంకెన్ని పిటీషన్లను స్వీకరించాలని సుప్రీం ధర్మాసనం అడిగింది. ఈమధ్యే వీవీప్యాట్కు చెందిన పిటీషన్లను పరిశీలించామని, కేవలం కల్పితాల ద్వారా ముందుకు వెళ్లలేమని, ప్రతి పద్ధతిలోనూ ప్లస్, మైనస్ ఉంటుందని, ఆర్టికల్ 32 కింద దీన్ని ఎంటర్టైన్ చేయలేమని సుప్రీం బెంచ్ తెలిపింది. ఈవీఎంల పనితీరు గురించి నందినీ శర్మ పిటీషన్ వేసింది. వ్యక్తిగతంగా ఆమె కోర్టు ముందు హాజరయ్యారు.
ఇతర పిటీషన్లను విచారిస్తున్న సమయంలోనే ఈవీఎంల గురించి విస్తృతంగా పరిశీలించామని, ఈ అంశంలో ఇప్పటికే పది కేసులను పరిశీలించినట్లు జస్టిస్ ఖన్నా తెలిపారు.