Supreme Court | న్యూఢిల్లీ : న్యాయవ్యవస్థపై ఇటీవల జరుగుతున్న దాడులను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. పార్లమెంటరీ, కార్యనిర్వాహక విధుల్లో తాము చొరబడుతున్నట్టు తమపై ఆరోపణలు వస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ సోమవారం వ్యాఖ్యానించారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు ఆదేశాలపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తీవ్ర వ్యాఖ్యలు చేసిన క్రమంలో గవాయ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.