RN Ravi | న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు సోమవారం తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి పలు ప్రశ్నలను సంధించింది. “శాసన సభ రెండోసారి ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు ఎలా పంపిస్తారు? బిల్లులపై ఏండ్లపాటు మౌనంగా ఎందుకు ఉన్నారు?
ప్రభుత్వానికి ఎందుకు సమాచారం ఇవ్వలేదు? మీ ఆమోదాన్ని తెలియజేయకుండా నిలిపి ఉంచి, రాష్ట్రపతి పరిశీలనకు ఎందుకు పంపించారు?” అని ప్రశ్నించింది. 12 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం లేదని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును రిజర్వు చేసింది.