న్యూఢిల్లీ, జూలై 28: టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, అతని భార్య రుజిరపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ)ను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. పశ్చిమ బెంగాల్లో బొగ్గు కుంభకోణం కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య దేశం వదిలిపోకుండా ఈడీ ఎల్ఓసీ జారీ చేసింది.
దీనిపై బెనర్జీ సుప్రీంను ఆశ్రయించగా, కపిల్ సిబల్ వాదిస్తూ వాస్తవానికి వారు వైద్య చికిత్సకు ఈ నెల 26నే విదేశాలకు వెళ్లవలసి ఉందని చెప్పారు. దీంతో ఆ ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించాలని ఆదేశిస్తూ జస్టిస్‌లు ఎస్కే కౌల్, సుధాంశు ధులియా ధర్మాససం ఈడీని ఆదేశించింది.