న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు గురువారం విచారించింది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను తప్పక పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది.
పహల్గాం ఉగ్ర దాడి ఘటన ప్రాముఖ్యతను ధర్మాసనం నొక్కి చెప్పింది. రాష్ట్ర హోదా పునరుద్ధరణపై 8 వారాల్లోగా ప్రతిస్పందన తెలపాలని కేంద్రానికి నోటీస్ జారీ చేసింది. రెండు నెలల్లో రాష్ట్ర హోదా పునరుద్ధరించాలంటూ హక్కుల కార్యకర్త ఒకరు పిటిషన్ దాఖలు చేశారు.