న్యూఢిల్లీ: వలస కార్మికులకు రేషన్ కార్డులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగంపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.ఈ-శ్రామ్ పోర్టల్లో నమోదైన వలస కార్మికులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ అహ్సనుద్దిన్ అమానుల్లా విచారించారు. ‘మేము సహనాన్ని కోల్పోయాం. నవంబరు 19 నాటికి అమలు చేయకపోతే మీ కార్యదర్శులు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది’ అని అన్నారు.