న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: సుప్రీంకోర్టు జడ్జి దినేశ్ మహేశ్వరి 23వ లా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. ఆయనతో పాటు కమిషన్ సభ్యులుగా డీపీ వర్మ, హితేశ్ జైన్లను నియమిస్తూ ప్రధాని మోదీ ఉత్తర్వులు జారీ చేశారని, దీంతో వారు మంగళవారం బాధ్యతలు చేపట్టారని న్యాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 3న ఏర్పాటై మూడేండ్ల పాటు ఉండే లా కమిషన్ దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెట్టవచ్చునా? లేదా? అన్న అంశాన్ని పరిశీలిస్తుంది.
2019లో సుప్రీం కోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మహేశ్వరి 2023 మేలో సుప్రీం కోర్టు జడ్జీగా పదవీ విరమణ చేశారు. ఆయన 2016లో మేఘాలయ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, 2018లో కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా వ్యవహరించారు.