Supreme Court | అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ 21 సార్లు వాయిదా కేసులో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఎన్వీ అంజరియా, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించాలని, ఈ విషయాన్ని స్వయంగా పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు కోర్టు కోరింది.
పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులను విచారించి.. త్వరగా పరిష్కరించాలని తాము పదే పదే చెప్పినట్లుగా ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం నిందితుడికి బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించినప్పటికీ, రాబోయే విచారణ తేదీ రోజున హైకోర్టు కేసును పరిష్కరించాలని స్పష్టం చేసింది. కుల్దీప్ అనే వ్యక్తి బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ 21 సార్లు వాయిదా పడిందని.. మళ్లీ రెండునెలల తర్వాత విచారణకు వస్తుందని పిటిషన్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇటీవల ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన కేసును 43 సార్లు వాయిదా వేసినట్లు న్యాయవాది ప్రస్తావించగా.. స్వయంగా పరిశీలించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తాను వ్యక్తిగతంగా అభ్యర్థించానని సీజేఐ తెలిపారు.
‘ఈ కేసులో బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరిస్తూ.. కనీసం తదుపరి విచారణ తేదీన హైకోర్టు ఈ విషయంపై బెయిల్ పిటిషన్పై తన ఉత్తర్వులను ప్రకటిస్తుందని చెప్పనవసరం లేదు’ అని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్ అసంతృప్తిగా ఉంటే.. మళ్లీ సుప్రీంకోర్టుకు రావొచ్చని సీజేఐ తెలిపారు. బెయిల్పై విచారణను వాయిదా వేసే ధోరణిని సీజేఐ ఇటీవల ఖండించారు. సీబీఐ కేసుల్లో మూడున్నర సంవత్సరాలకుపైగా కస్టడీలో ఉన్న నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో 43 సార్లు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఆగస్టు 25న కోర్టు రామ్నాథ్ మిశ్రా అలియాస్ రామనాథ్ మిశ్రా విజ్ఞప్తిని అంగీకరించి.. ఇతర కేసులోనూ అవసరం లేకపోతే అతన్ని విడుదల చేయాలని ఆదేశించింది.