న్యూఢిల్లీ, అక్టోబర్ 15: దేశ రాజధాని ఢిల్లీవాసులకు సుప్రీంకోర్టు దీపావళి శుభవార్త చెప్పింది. కాలుష్య నియంత్రణలో భాగంగా అమల్లో ఉన్న సంపూర్ణ బాణాసంచా నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. దీపావళి వేడుకల కోసం ‘గ్రీన్ క్రాకర్స్’ అమ్మకాలు, వినియోగానికి షరతులతో కూడిన అనుమతి మంజూరుచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది.
ఈ తీర్పు ప్రకారం, ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో ప్రజలు అక్టోబర్ 18 నుంచి 21 వరకు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కొనుగోలు చేయవచ్చు, వినియోగించవచ్చు. అయితే వీటిని పేల్చడానికి నిర్దిష్టమైన సమయాన్ని సూచించింది. ఉదయం 6 నుంచి 7, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చాలని ధర్మాసనం పేర్కొన్నది.