న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ, దాని డైరెక్టర్ తమ ప్రాసిక్యూటర్లకు ఆధారాలు అందజేయడంతో పాటు సలహాలు, సూచనలు అందచేయవచ్చునని, అయితే వారు కోర్టులో ఎలా ప్రవర్తించాలో నిర్దేశించలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయాధికారుల స్వతంత్రతను సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.
దర్యాప్తు సంస్థల ప్రభావం పరిమితం మాత్రమేనని స్పష్టం చేసింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన జీషన్ హైదర్, దాద్ నసీర్లకు బెయిల్ మంజూరు చేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘కేసుకు సంబంధించి ప్రాసిక్యూటర్లకు ఈడీ సూచనలు ఇవ్వవచ్చు. అయితే వారు కోర్టులో ఎలా వ్యవహరించాలో సూచనలు ఇవ్వలేరు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.