Supreme Court | న్యూఢిల్లీ : నివాస యోగ్యమైన ఇండ్లను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నిధులు ఉండటం లేదని, ప్రజలు తాగడానికి పరిశుభ్రమైన నీరు లేదని, అటువంటి సమయంలో మీరు సైకిల్ ట్రాక్స్ కోసం పగటి కలలు కంటున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా సైకిల్ ట్రాక్‌లను నిర్మించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను తిరస్కరించింది.
మురికివాడల్లోకి ఓసారి వెళ్లి, అక్కడి ప్రజలు ఎలా జీవిస్తున్నారో చూడాలని, ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని తెలిపింది. ఎంచుకునే ప్రాధాన్యతలు సరైన విధంగా ఉండాలని, అత్యవసరమైన సమస్యల పట్ల దృష్టి సారించాలని హితవు పలికింది.