2020, జూన్ 15న గల్వాన్ వ్యాలీలో భారత్, చైనా దళాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణే ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు అపూర్వ లాఖియా తెరకెక్కిస్తున్న పానిండియా వార్ డ్రామా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తూ, ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలావుంటే.. తాజా పరిణామాల దృష్ట్యా ఈ చిత్రం టైటిల్‌ని ‘మాతృభూమి’గా మార్చారు. అలాగే ఈ సినిమాను ముందు ఏప్రిల్ 17న విడుదల చేయాలని మేకర్స్ భావించారు.
కానీ ఇప్పుడు విడుదలను ఆగస్ట్‌కు వాయిదా వేశారు. ఈ విషయాలను తెలియజేస్తూ సోమవారం ఓ పోస్టర్ని విడుదల చేశారు. రక్తంతో తడిసిన చెక్క దుంగ, దానికి చుట్టబడ్డ ఇనుపముళ్ల గొలుసు.. ఆ దుంగను పట్టుకొని, దాని చాటున నిలబడి తీక్షణంగా చూస్తున్న సల్మాన్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. ఘర్షణ సమయంలో భారత దళాలకు నాయకత్వం వహించిన కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్‌బాబు పాత్రను ఇందులో సల్మాన్ పోషిస్తున్నారు. చిత్రాంగదసింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అభిలాష్ చౌదరి, అంకుర్ భాటియా కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: హిమేష్ రేష్మియా.