జంక్ ఫుడ్ ప్యాకెట్లపై హెచ్చరిక లేబుల్ ఉండాలి
ప్రజలు, ముఖ్యంగా ఎదిగే పిల్లల ఆరోగ్యం పట్ల సుప్రీంకోర్టు గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు కలిగిన ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తుల ముందు భాగంలో హెచ్చరిక లేబుళ్లను ఏర్పాటు చేసే అంశాన్ని జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పరిశీలించాలని ఆహార భద్రతకు సంబంధించిన వారందరినీ న్యాయస్థానం కోరింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీవ్రమైన విషయంపై సవివరమైన ఉత్తర్వులు జారీచేస్తామని, సంబంధిత వర్గాల నుంచి సమాచారం కోరుతామని తెలిపింది.
- ఎదిగే పిల్లల ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన
న్యూఢిల్లీ: ప్రజలు, ముఖ్యంగా ఎదిగే పిల్లల ఆరోగ్యం పట్ల సుప్రీంకోర్టు గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు కలిగిన ప్యాక్ చేసిన ఆహార ఉత్పత్తుల ముందు భాగంలో హెచ్చరిక లేబుళ్లను ఏర్పాటు చేసే అంశాన్ని జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పరిశీలించాలని ఆహార భద్రతకు సంబంధించిన వారందరినీ న్యాయస్థానం కోరింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీవ్రమైన విషయంపై సవివరమైన ఉత్తర్వులు జారీచేస్తామని, సంబంధిత వర్గాల నుంచి సమాచారం కోరుతామని తెలిపింది.
మాకు ప్రజల ఆరోగ్యం, ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల ఆరోగ్యం గురించే ఆందోళన. సంబంధిత వర్గాలన్నీ ఈ విషయాన్ని జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాము అని ధర్మాసనం పేర్కొంది. తాము కూడా ఈ విషయంపై కొంత కసరత్తు చేశామని, ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేస్తున్నామని తెలిపింది. ఆహార పదార్థాల్లో చక్కెర, ఉప్పు లేదా కొవ్వు పరిమితిని దాటినపుడు ఆ విషయాన్ని ప్యాకెట్ ముందు భాగంలో చూపించడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైనా మార్గదర్శకాన్ని రూపొందించిందా అని ధర్మాసనం ప్రశ్నించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

