సీఎం మారినా పాలన మారలే!
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పాలనకు 100 రోజులు పూర్తయ్యింది. ముఖ్యమంత్రి మారినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఈ ఏడాది జూన్ 3న శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా సమర్థవంతమైన పాలనతో పాటు అసంతృప్తితో ఉన్న వారిని బుజ్జగించాల్సిన తక్షణ బాధ్యత ఆయనపై పడింది. అయితే వందరోజుల పాలనలో పలు వైఫల్యాలు చోటుచేసుకున్నాయి. పార్కుల సవరణ బిల్లుపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
- డీకే వంద రోజుల పాలనపై కన్నడ ప్రజల విమర్శలు
బెంగళూరు, సెప్టెంబర్ 10: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పాలనకు 100 రోజులు పూర్తయ్యింది. ముఖ్యమంత్రి మారినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఈ ఏడాది జూన్ 3న శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా సమర్థవంతమైన పాలనతో పాటు అసంతృప్తితో ఉన్న వారిని బుజ్జగించాల్సిన తక్షణ బాధ్యత ఆయనపై పడింది. అయితే వందరోజుల పాలనలో పలు వైఫల్యాలు చోటుచేసుకున్నాయి. పార్కుల సవరణ బిల్లుపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
మహర్షి వాల్మీకి షెడ్యూల్డు తెగల అభివృద్ధి కార్పొరేషన్లో జరిగిన అక్రమాలపై మంత్రి బీ నాగేంద్ర రాజీనామా చేయాల్సి వచ్చింది. బిడది జీబీఐటీ టౌన్షిప్ ప్రాజెక్టుపై రైతులు, స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు తమ భూమిని ఇచ్చే ప్రసక్తి లేదని వారు తెగేసి చెబుతున్నారు. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నపత్రాలు లీక్, ఓఎంఆర్ షీట్ల తారుమారు, పేపర్ల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. లక్షలాది రూపాయలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలను అమ్ముకుందని బీజేపీ విమర్శించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

